ఓం నమో వేంకటేశాయ: కలియుగ దైవం శ్రీవారి ఆధ్యాత్మిక వైశిష్ట్యం

కలియుగ వైకుంఠం: తిరుమల వేంకటేశ్వర వైభవం
కలియుగంలో మానవాళిని ఉద్ధరించడానికి వెలసిన సాక్షాత్తు శ్రీమన్నారాయణుని రూపమే తిరుమల వేంకటేశ్వర స్వామి. ఏడు కొండల పైన, శేషాచల గిరుల మధ్య వెలసిన ఈ క్షేత్రం భక్తులకు ఒక దివ్యధామం. "వేం" అంటే పాపాలు, "కట" అంటే హరించడం; అంటే దర్శించిన మాత్రాన పాపాలను దహించివేసే దైవం ఆయన. శ్రీవారి దివ్య మంగళ స్వరూపం, ఆనంద నిలయ విమానం, మరియు వేకువజామున జరిగే సుప్రభాత సేవ భక్తులకు అనిర్వచనీయమైన అనుభూతిని ఇస్తాయి. గోవింద నామ స్మరణతో తిరుమల కొండలు ప్రతిధ్వనిస్తుంటే, భక్తుల హృదయాలు భక్తి పారవశ్యంలో మునిగిపోతాయి. ఎన్ని కష్టాలు ఉన్నా, ఆ "వడ్డీ కాసుల వాడి" ఒక్క చూపు పడితే చాలు, జీవితం ధన్యమౌతుందని కోట్లాది మంది నమ్మకం. భక్తి, శరణాగతికి తిరుమల ఒక నిలువుటద్దం. 
                                                        .. భవాని

Post a Comment

0 Comments