అరుదైన పశ్చిమాభిముఖ శివాలయం: పాలకొండ సమీపంలోని గోకరుణేశ్వర స్వామి ఆలయ అద్భుతం!
ఈరోజు మనం ఒక అద్భుతమైన, ఎంతో పవిత్రమైన పుణ్యక్షేత్రం గురించి తెలుసుకుందాం. పార్వతీపురం మన్యం జిల్లా, పాలకొండ మండలంలో వెలసిన ఈ ఆలయం ఆధ్యాత్మిక ప్రపంచంలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. ఈ ఆలయం దేవాదాయ శాఖ పరిధిలో వున్నది..
అరుదైన పశ్చిమాభిముఖం!
సాధారణంగా శివాలయాలు తూర్పు ముఖంగా లేదా ఉత్తర ముఖంగా ఉంటాయి. పాలకొండ మండలం, బుట్టి మఠం శ్రీ జగన్నాథ స్వామి ఆలయానికి వెళ్లే దారిలో, చెరువుగట్టుపై కొలువై ఉన్న ఈ శివాలయం పశ్చిమాభిముఖంగా ఉండటం విశేషం! పశ్చిమాభిముఖ శివాలయాలు చాలా అరుదుగా కనిపిస్తాయి, అందుకే దీనిని దర్శించడం ఎంతో పుణ్యప్రదమని భక్తులు విశ్వసిస్తారు.
గోకర్ణ మఠం - గోకరుణేశ్వర స్వామి!
ఈ పురాతన శివాలయం 'గోకర్ణ మఠం' పేరుతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడి శివుడు *'గోకరుణేశ్వర స్వామి'*గా భక్తులకు అభయమిస్తున్నారు. ఈ స్వామిని దర్శిస్తే పుణ్యం సంప్రాప్తిస్తుందని, కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. పాలకొండ ప్రాంతంలో ఇది ఏకైక పశ్చిమాభిముఖ శివాలయం కావడం మరింత ప్రత్యేకత.
బ్రహ్మసూత్రం రేఖలు!
మరీ ముఖ్యంగా, ఈ శివలింగానికి బ్రహ్మసూత్రం రేఖలు ఉండటం ఈ దేవాలయం పురాణ ప్రాధాన్యతను చాటుతుంది. ఇవి కేవలం అత్యంత ప్రాచీన, శక్తివంతమైన శివలింగాలకు మాత్రమే ఉండే అరుదైన చిహ్నాలు. ఈ అరుదైన పశ్చిమాభిముఖ శివుని దర్శించి, ఆయన అనుగ్రహం పొందడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? వీలైనంత త్వరగా శ్రీ గోకరుణేశ్వర స్వామి వారిని దర్శించుకుని, పుణ్యాన్ని సంపాదించండి! మీ అనుభవాలను కామెంట్లలో పంచుకోండి.
స్థల పురాణం ప్రకారం, క్రీ.శ. 1786లో పరమ గురు బసవేశ్వర స్వామి ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్టించారు. సంతానం లేని పాలకొండ భూస్వామి మల్లయ్య - స్వామివారి పూజల ఫలితంగా సంతానం కలిగినట్లు చరిత్ర చెబుతోంది. బసవేశ్వర స్వామి అనంతరం వీర మల్లయ్య, చెన్న మల్లయ్య అనే మఠాధిపతులు ఆలయాన్ని సేవించారు. వీరి సమాధులు ఆలయ ప్రాంగణం పక్కనే ఉన్నాయి.
... . భాసురు శివ శంకర ప్రసాద్, ఎడిటర్, పాలకొండ వెబ్ న్యూస్


0 Comments