పాలకొండ కోటదుర్గమ్మ ఆలయ చరిత్ర – దేవదాయ శాఖ పరిధిలోని పవిత్ర శక్తిపీఠం

 

palakonda web news పాలకొండ కోటదుర్గమ్మ ఆలయం, పాలకొండ మండలం, పార్వతీపురం మన్యం జిల్లా

పాలకొండ వెబ్ న్యూస్ : పాలకొండ,  పాలకొండ మండలం, పార్వతీపురం మన్యం జిల్లా. 

         దేవదాయ ధర్మదాయ శాఖ పరిధిలో ఉన్న ఈ కోటదుర్గమ్మ ఆలయానికి చారిత్రక ప్రాధాన్యం అపారంగా ఉంది. స్థల పురాణం ప్రకారం పాలకొండ రాజులు తమ కోటలో శ్రీ దుర్గమ్మను ఆరాధించేవారని చెబుతారు. రాజ్య విభేదాలు, యుద్ధాల వలన కోట శిధిలమైనా, అమ్మవారి మహిమ మాత్రం శాశ్వతంగా నిలిచింది.


       1846లో ఒడిశాకు చెందిన భక్తుడు కృష్ణ వల్లభ దాసు స్వప్న దర్శనంతో అమ్మవారి శిలామూర్తులను వెలికి తీయగా, అదే ఆయన చేతుల మీదుగా పూజలు తిరిగి ప్రారంభమయ్యాయి. తరువాత ఒడిశా శిల్పులచే ప్రస్తుత విగ్రహం ప్రతిష్ఠించబడింది. నేటి వరకు ఆ సంప్రదాయం కొనసాగుతూనే ఉంది.

కోటదుర్గమ్మ ఆలయం చరిత్ర    

        రాజుల కాలంలో నిర్మించబడిన ఈ ఆలయం ఉత్తరాంధ్ర ఆధ్యాత్మిక వారసత్వానికి ప్రతీకగా నిలిచింది. సుమారు 70 ఏళ్ల క్రితం కృష్ణ వల్లభదాస్ సంతానం కృపాసింధు దాస్ ఆలయ అర్చకత్వాన్ని చేపట్టి పూజా విధానాలకు మరింత శోభ చేకూర్చారు. ప్రస్తుతం ఆలయం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో మరింత వైభవంగా అభివృద్ధి చెందుతోంది.

దసరా ఉత్సవాల వైభవం          

ప్రతి ఏడాది జరిగే దసరా ఉత్సవాలు పాలకొండలో విశేషంగా జరుగుతాయి వుత్సవాలకు పది రోజుల ముందే అమ్మవారి విగ్రహాన్ని భక్తులకు కనిపించకుండా చేసి ప్రత్యేక అలంకరణలుప్రారంభిస్తారు. ఖామాకలాపం అనే యక్షిణి గానం చివరి రోజున నిర్వహించడం ప్రత్యేక విశేషం. దసరా రోజున గిరిజన సాంప్రదాయనృత్యాలతో ఉత్సవాన్ని నడిపిస్తారు. కోయ డాన్సులు, పులి వేషాలు, పౌరాణిక పాత్రధారణలతో ఊరేగింపులు జరుగుతాయి. పాలకొండ పట్టణంలో పలు వీధుల్లో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగిస్తూ భక్తులు అమ్మా! భవానీ దుర్గమ్మా శరణు శరణు!అంటూ గళం విప్పుతారు. పాలకొండ వీధులు భక్తుల జయజయ ధ్వనులతో మారుమ్రోగుతాయి.

పాలకొండ వెబ్ న్యూస్ శ్రీ కోటదుర్గ ఆలయం

భక్తుల రద్దీ, విశ్వాసం

        ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలపాటు విదేశాల్లో నివసించే తెలుగువారు సైతం ఈ ఉత్సవాల సమయంలో పాలకొండకు వస్తుంటారు. కోరికలు తీర్చే తల్లిగా కోటదుర్గమ్మకు ఉన్న ఖ్యాతి ఈ ప్రాంతంలో అచంచలంగా కొనసాగుతోంది.

భక్తుల సౌకర్యాలు

        భక్తుల రాకపోకలకు సౌకర్యంగా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో కళ్యాణకట్ట, తాగునీటి వసతి, విశ్రాంతి గృహాలు ఏర్పాటు చేశారు. రవాణా సౌకర్యాల పరంగా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పార్వతీపురం రైల్వే స్టేషన్‌ల నుండి ప్రతి అరగంటకోసారి పాలకొండకు బస్సులు నడుస్తున్నాయి..

------ BHASURU SIVA SANKRA PRASAD, Editor. Cell 9985291832

పాలకొండ వెబ్ న్యూస్ తాజా వార్తల కోసం .. క్లిక్ చేయండి 

 

 

Post a Comment

0 Comments