పాలకొండ వెబ్ న్యూస్: శ్రీ సత్యసాయి బాబావారి దివ్య అవతార శతవర్ష జన్మదినోత్సవ వేడుకలు: పాలకొండలో నవంబర్ 18 నుండి 23 వరకు మహా సేవ కార్యక్రమాలుసేవా కార్యక్రమాలతో బాబావారి శత జయంతిని ఘనంగా నిర్వహించనున్న భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి.

పాలకొండ, నవంబర్ 16 (దినపత్రిక ప్రతినిధి):
భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య అవతార శతవర్ష జన్మదినోత్సవ వేడుకలు పురస్కరించుకొని, పాలకొండ పట్టణంలో నవంబర్ 18, 2025 మంగళవారం నుండి నవంబర్ 23, 2025 ఆదివారం వరకు ఆరు రోజుల పాటు ఘనంగా సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి పాలకొండ శాఖ ప్రకటించింది. 'సదా శ్రీ సత్యసాయి భగవానుని సేవలో' అనే నినాదంతో ఈ వేడుకలను నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా సమితి ఒక ప్రకటన విడుదల చేసింది, "Bhagavan Sri Sathya Sai Baba Varu is the Head and Guardian of this Occasion, a Silent Listener in every Conversation and an unseen Guest at every need" అని పేర్కొంది.
అత్యంత ముఖ్యమైన శాశ్వత సేవా కార్యక్రమ వివరాలు:
శత జయంతి సందర్భంగా, సేవా సమితి తమ శాశ్వత సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేయనున్నట్లు తెలిపింది. ఈ కార్యక్రమాలలో ప్రధానంగా:
 * శ్రీ సత్యసాయి నారాయణ సేవ: 23 గ్రామాలలో నిరాశ్రయులకు క్యారేజీల ద్వారా ఇంటికే భోజనం అందించే కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతుంది.
 * శ్రీ సత్యసాయి అన్నదానం: ప్రభుత్వ ఆసుపత్రి రోగుల సహాయకులకు నిత్యం అన్నదానం అందించడం.
 * శ్రీ సత్యసాయి ఫ్రీజర్ బాక్స్ సేవలు: మృతదేహాలను భద్రపరిచేందుకు ఫ్రీజర్ బాక్సుల సేవలు.
 * శ్రీ సత్యసాయి స్కిల్ డెవలప్‌మెంట్ సేవలు: మహిళా సోదరీమణుల కోసం ఉచిత కుట్టు శిక్షణా శిబిరాల నిర్వహణ.
 * శ్రీ సత్యసాయి సుజల స్రవంతి: ప్రజలకు శుద్ధ జల సేవలు అందించడం.
 * శ్రీ సత్యసాయి ప్రేమామృత ప్రసాదం పంపిణీ: పాలకొండ, అన్నవరం ప్రభుత్వ ఆసుపత్రులలోని గర్భిణీ స్త్రీలకు ప్రతీ నెల 9వ తేదీన ఈ ప్రసాదాన్ని పంపిణీ చేస్తారు.
 * శ్రీ సత్యసాయి అమృత కలశి సేవలు: ప్రతీ నెల 19వ తేదీన నిర్వహించబడే ప్రత్యేక సేవా కార్యక్రమం.
 * శ్రీ సత్యసాయి దీనజనోద్ధరణ పథకం: ఈ సంస్థ ద్వారా ఎంపిక కాబడిన వివిధ ప్రాంతాల విద్యార్థులకు ఇంజనీరింగ్, డిగ్రీ చదువులకు సహకారం అందిస్తున్నారు. ప్రస్తుతం 5 గురు విద్యార్థులు ఈ పథకం ద్వారా లబ్ది పొందుతున్నారు.
ఈ దివ్యమైన వేడుకలకు భక్తులు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరై బాబావారి అనుగ్రహాన్ని పొందాలని సేవా సమితి కోరింది.

Post a Comment

0 Comments