పాలకొండ టెంపుల్స్ బ్లాగ్ ప్రారంభం: భక్తులకు దేవాలయ విశేషాలు సులభతరం!

PALAKONDA TEMPLES BLOGSPOT COM

పాలకొండ వెబ్ న్యూస్ :
 30.10.2025 పాలకొండకు చెందిన బాసూరు శివశంకర ప్రసాద్ రూపొందించిన 'పాలకొండ టెంపుల్స్ బ్లాగ్'ను శ్రీ కోట దుర్గమ్మ దేవస్థానం కార్యనిర్వహణ అధికారి (EO) వి. వి. సూర్యనారాయణ ఈరోజు ఆలయ సన్నిధిలో లాంచనంగా ప్రారంభించారు. బ్లాగ్ లింకును క్లిక్ చేసి శ్రీ కోటదుర్గమ్మ వారి చరిత్ర విశేషాలను ఆయన ఆవిష్కరించారు. కార్యనిర్వహణ అధికారి సూర్యనారాయణ మాట్లాడుతూపాలకొండలోని అన్ని దేవాలయాలను ఒకే చోట చేర్చివాటి విశేషాలుప్రాధాన్యతలను ఇందులో పొందుపరచడం ద్వారా భక్తులు ఎక్కడి నుండైనా ఆలయాల గురించి తెలుసుకునే అవకాశం లభించిందని అన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు దార్లపూడి లక్ష్మీ ప్రసాద్ శర్మ మాట్లాడుతూపాలకొండలోని దేవాలయాల విశిష్టతను ఈ బ్లాగ్ ద్వారా భక్త జనానికి తెలియజేయడం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.


ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు జె. కామేశ్వర రావు,  ప్రెస్ క్లబ్ కార్యవర్గం, ఆలయ జూనియర్ అసిస్టెంట్లు కె. పరమేశ్వరివేమకోటి శ్రీనివాస రావుప్రెస్ క్లబ్ కార్యవర్గంసభ్యులు పాల్గొన్నారు.


Post a Comment

0 Comments