పాలకొండ వెబ్ న్యూస్ :
శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిన్న మధ్య తరహా వార్తా పత్రికల సంఘం (సామ్నా) అధ్యక్షులు, నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్, మరియు తూరుపు తీరం పత్రిక సంపాదకులు గౌరవనీయులు నల్లి ధర్మారావు గారికి శ్రీకాకుళంలో ఒక విశిష్టమైన పుస్తకాన్ని అందజేశారు.
శివ భక్తి మరియు శివ క్షేత్రాల గొప్పతనాన్ని తెలియజేస్తూ పాత్రికేయుడు, రచయిత భాసురు శివ శంకర ప్రసాద్ రచించిన "పంచ శివలింగ వైభవం శివ క్షేత్ర దర్శనం" అనే పుస్తకాన్ని నల్లి ధర్మారావు గారికి అందించారు. ఈ సందర్భంగా, సీనియర్ సబ్ ఎడిటర్ కొలిపాక హేమచంద్ర కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
పుస్తకాన్ని స్వీకరించిన అనంతరం, ధర్మారావు గారు దాని విశిష్టతను అడిగి తెలుసుకున్నారు. ఆధ్యాత్మిక విషయాలపై, ముఖ్యంగా స్థానిక శివ క్షేత్రాల గురించి రాయడాన్ని ఆయన ఎంతగానో అభినందించారు. ఇటువంటి రచనలు సమాజానికి ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు.


0 Comments